ఫాంలోకి వచ్చిన మంజూష.. వరుస ఈవెంట్స్ తో బిజీ బిజీ..!

shami
తెలుగు బుల్లితెర యాంకర్స్ చాలామంది ఉన్నా సరే అందరు కేవలం కొంతమందిని మాత్రమే రిపీట్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వారికి ఉన్న క్రేజ్ ని బట్టి యాంకర్స్ ని తీసుకుంటారు. సినిమా ఈవెంట్ అంటే కేరాఫ్ సుమ అనేలా ఆమె ఫిక్స్ అయ్యి వస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోల ఈవెంట్స్ కి మాత్రమే వచ్చే సుమ ఈమధ్య స్మాల్ బడ్జెట్ సినిమాలకు కూడా వస్తుంది. సుమ వస్తే సినిమా హిట్టే అన్న టాక్ కూడా రావడంతో ఆమె లక్కీ హ్యాండ్ అయ్యింది. అయితే కొన్ని ఈవెంట్స్ కి సుమ రావడం కుదరకపోతే శ్యామల వస్తుంది. ఆమె కూడా రాకపోతే మంజూష వస్తుంది.
ఎప్పుడో దశాబ్ధ కాలం నుంచి యాంకర్ గా తన సత్తా చాటుతున్న మంజూషా కెరియర్ లో పీక్స్ లో ఉన్న టైం లోనే ఎందుకో వెనకపడ్డది. ఈ క్రమంలో కొన్నాళ్లు అర్ధాంతరంగా గ్యాప్ తీసుకున్న ఆమె మళ్లీ తిరిగి వరుస షోలతో బిజీగా ఉంది. ఈమధ్య ఏ ఈవెంట్ చూసినా.. ఏ ఇంటర్వ్యూ చూసినా సరే మంజూష దర్శనమిస్తుంది. చాలా కాలం తర్వాత మంజూష చాలా బిజీగా మారిందని చెప్పొచ్చు. చూస్తుంటే యాంకర్ గా మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేసినట్టే అని చెప్పుకుంటున్నారు.
యాంకర్ గా తన మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తున్న మంజూష తన అనుభవంతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఈమధ్య ఏ ఈవెంట్ చూసినా సరే మంజూష కనిపిస్తుంది. ఇంటర్వ్యూస్ కూడా ఆమె చేస్తూ సందడి చేస్తుంది. ఈవెంట్స్ కి.. ఇంటర్వ్యూస్ కి ఆమె రెమ్యునరేషన్ కూడా తగినట్టుగానే తీసుకుంటుందని తెలుస్తుంది. మరి మంజూషా ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం సుమకి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. యాంకర్ గా చేస్తూనే సినిమా ప్రయత్నాలు చేసిన అమ్మడు అక్కడ కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో కొన్నాళ్లు కెరియర్ కి గ్యాప్ ఇచ్చి తిరిగి మళ్లీ తన యాంకరింగ్ కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: