25 రోజులో 'విక్రమ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల ఇవే..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో  హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ లో కమల్ హాసన్ హీరోగా నటించగా విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు . అలాగే మలయాళ స్టార్ హీరోలలో ఒకరు ఆయన ఫహాద్ ఫాజిల్ ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో నటించాడు . వీరితో పాటు ఈ మూవీ లో కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సూర్య  గెస్ట్ రోల్ లో నటించాడు .

సూర్య ఈ మూవీ లో రోలెక్స్ అనే పాత్రలో కనిపించాడు . విక్రమ్ మూవీ లో సూర్య కనిపించింది అతి తక్కువ సమయమే అయినప్పటికీ , ఈ సినిమా విజయంలో మాత్రం కీలక పాత్ర ను పోషించాడు . జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విక్రమ్ సినిమా ఇప్పటి వరకు 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది . ఇప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను రాబడుతోంది . మరి 25 రోజులకు గాను విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.


తమిళనాడు లో 171.25 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాలలో : 29.30 కోట్లు .
కర్ణాటక లో : 20.40 కోట్లు .
కేరళ లో : 38.10 కోట్లు .
రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 11.75 కోట్లు .
ఓవర్ సీస్ లో 120.20 కోట్లు .
25 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ సినిమా 194.25 కోట్ల షేర్ , 391 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: