ఆ సినిమా వదులుకుని తప్పు చేశా.. బాధ పడుతున్న హీరో జై!

praveen
తమిళ హీరో జై ఇక్కడ కూడా పరిచయమే. ఒకే ఒక్క తమిళ్ డబ్బింగ్ సినిమా జర్నీతో జై ఇక్కడ కూడా పాపులర్ అయ్యాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం తో తమిళం లో కూడా మంచి మూవీలు చేస్తూ జై బిజీ అయ్యాడు. సరిగ్గా అదే తరుణం లో వేణు వెంటనే వచ్చిన ఫ్లాపులు మనోడిని అగాధం లోకి నెట్టేశాయి. దాంతో కాస్త కెరియర్ పరంగా డల్ అయ్యారు జై. అయితే జై ప్రస్తుతం కెరీర్ లో మొదటి సారిగా తమిళ మూవీ “పట్టంబూచి” అనే సినిమా లో విలన్ గా నటిస్తున్నారు ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.  
 
ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగం గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన జై తన కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఏ మాయ చేసావే సినిమా అందరికీ సుపరిచితమే. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రం తమిళం లో విన్నైతాండి పేరుతో రిలీజై అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా లో హీరోగా శింబు, హీరోయిన్ గా త్రిష నటించారు. అయితే లెక్క ప్రకారం ఈ సినిమాలో జై నటించాల్సి ఉందట. ఎందుకంటే డైరక్టర్ గౌతమ్ ఈ సినిమాకోసం మొదటగా జై ని కలిశాడట.
 
అయితే ఆ సమయంలో జై వేరే సినిమాలో బిజీ షెడ్యూల్ ఉన్నందువలన చేయలేకపోయాడట. దానికి జై మాట్లాడుతూ. సినిమా ఆఫర్ మొదట తనకే వచ్చింది కానీ తన డేట్స్ అడ్జస్ట్ కాలేక పోవడం వల్ల ఈ సినిమాను వదులుకోవలసి వచ్చింది, లేదంటే నా సినిమా కెరీర్ మరోలా ఉండేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కుష్బూ సుందర్ నిర్మించిన ఇన్వెస్ట్మెంట్ థ్రిల్లర్ చిత్రం 'పట్టంబూచి'కి బద్రి వెంకటేష్ దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: