NTR30 : ఆ సీన్ చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ..!

Anilkumar
తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.  అయితే వీరి ఇద్దరి కాంబోలో  మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా మొదలుపెట్టినా పరవాలేదని అయితే సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలావుంటే అనధికారికంగా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీలో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

ఇకపోతే ఈ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని బోగట్టా. అంతేకాక యాక్షన్ సీన్ తో ఇంటర్వెల్ సీన్ ఉంటుందని ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఈ సీన్ ను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.ఇదిలావుంటే గతంలో తారక్ ఎప్పుడూ కనిపించని విధంగా ఈ సీన్ ఉంటుందని తెలుస్తోంది.ఇకపోతే  ఆగష్టులో ఈ సినిమా షూట్ మొదలుకానుంది.కాగా  ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ బరువు తగ్గనున్నారని సమాచారం అందుతోంది.ఇక  తారక్ ఈ సినిమా కోసం ఏకంగా 9 కిలోలు బరువు తగ్గుతున్నారని తెలుస్తోంది.కాగా 2023 సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరగనుంది.

పోతే  ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం జనతా గ్యారేజ్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.అయితే  తారక్ తన తర్వాత సినిమాతో ఆ సినిమాను మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.తాజాగా  ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.ఇకపోతే తారక్ కొరటాల శివ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. కాగా కొరటాల శివకు కెరీర్ పరంగా ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే. ఇక కొరటాల శివ ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: