టాలీవుడ్ ఫిల్మ్
ఇండస్ట్రీ నుంచి మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్. తాజాగా
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో
అల్లూరి సీతారామరాజు గా నటించి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్
ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం దక్షిణాది సంచలన దర్శకుడు
శంకర్ దర్శకత్వంలో ఓ
సినిమా చేస్తున్నాడు. ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ
సినిమా తెరకెక్కుతోండగా ఈ
సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక
శంకర్ దర్శకత్వంలో
సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే.ఈయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు తాజాగా చరణ్ బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే
రామ్ చరణ్ ఉపాసన పెళ్లి రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ
సినిమా షూట్ కు బ్రేక్ పడింది. వీరి పదవ
పెళ్లి రోజు కావడంతో ఈ దంపతులు ఈ స్పెషల్ డే ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి కుటుంబంతో ఎంజాయ్ చేసిన ఫోటోలను వీడియో రూపంలో తాజాగా
రామ్ చరణ్ భార్య
ఉపాసన సోషల్
మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు మెగా ఫాన్స్ ని
నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇద్దరు కలిసి చేయి చేయి పట్టుకొని నడుస్తున్న ఫోటో.. స్నేహితుల మధ్య ఉన్న ఫోటో ఫాన్స్ ని మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఫోటోలు అన్నింటితో వీడియో చేసి
ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది." మా చుట్టు ప్రేమించే శ్రేయోభిలాషులు ఇంతమంది ఉన్నందుకు మేము నిజంగా అదృష్టవంతులం. మా వార్షికోత్సవం చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదములు.. కృతజ్ఞతతో.." అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఈ వీడియో షేర్ చేసింది ఉపాసన. ఇక ఫ్యామిలీ గురించి స్నేహం గురించి
ఉపాసన తన మాటల్లో చెబుతూ ఎమోషనల్ అవ్వడం ఫాన్స్ ని
నెటిజన్స్ ని ఆకర్షించింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్లో తెగ వైరల్ గా మారింది...!!