నందమూరి నటసింహం
బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ సినిమాతో
బాక్స్ ఆఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ
సినిమా కంటే ముందు వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్న
బాలకృష్ణ అఖండ సినిమాతో ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించి
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు .
ఈ
మాస్ బ్లాక్ బస్టర్ మూవీ కి
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.
పూర్ణ ఒక కీలక పాత్రలో నటించగా , ఈ
మూవీ లో
శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.
థియేటర్ లలో భారీ
బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ
సినిమా కొంత కాలం క్రితం నుండే ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అయిన డిస్ని ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది. 'ఓ టి టి' లో కూడా అఖండ
సినిమా అదిరిపోయే రేంజ్ ప్రేక్షకాదరణ పొందింది. ఇలా
థియేటర్ మరియు 'ఓ టి టి' లో అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందిన అఖండ
సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లితెరపై ప్రసారమైంది.
మొదటి సారి బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు అఖండ
సినిమా 13.31 'టి ఆర్ పి' ని సాధించింది. అయితే తాజాగా రెండవ సారి బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు అఖండ
మూవీ 7.31 'టి ఆర్ పి' ని సాధించింది. రెండవ సారి ఈ రేంజ్ 'టి ఆర్ పి' ని సాధించడం అనేది చిన్న విషయం కాదు. ఇలా బుల్లితెరపై
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ
సినిమా రెండవ సారి కూడా అదిరిపోయే 'టి ఆర్ పి' ని సాధించింది.