కేతికశర్మ .....మనందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఈమె
పూరి జగన్నాథ్ కొడుకు
ఆకాష్ పూరి హీరోగా ...మరియు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' చిత్రంతో
హీరోయిన్ గా నటించి మనందరికీ పరిచయమైంది .ఆమె
హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక దీని తర్వాత ఈమెకు ఆ
సినిమా అంతంత మాత్రం ఆడినా ఈమె గ్లామర్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత ఈమె
నాగ శౌర్య తో చేసిన 'లక్ష్య' రాంగ్ టైం లో రిలీజ్ అవ్వడం వల్ల అది కూడా నిలబడలేకపోయింది.
ప్రస్తుతం ఇప్పుడు ఈమె మెగా
హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగ రంగ వైభవంగా' చిత్రంలో
హీరోయిన్ గా నటిస్తోంది.ఇకపోతే త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ
సినిమా హిట్ అయ్యి ఆమెకి యూత్ లో ఉన్న క్రేజ్ ను పెంచుతుందా లేదా అన్నది చూడాలి..! అయితే ఇక ఈమె
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది అనేది ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం. ఇకపోతే పవన్ కు ఈమె జోడీగా నటించడం లేదు.ఈమె అతని మేనల్లుడు
సాయి ధరమ్ తేజ్ కు జోడీగా నటించబోతుంది.
అంటే ఈమె తమ్ముడి
సినిమా అయిపోయాక అన్నయ్యతో నటించబోతుంది అన్న మాట.ఇదిలావుంటే
సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్..సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో 'వినోదయ సీతమ్'
రీమేక్ కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే 'పీపుల్స్
మీడియా ఫ్యాక్టరీ' బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కాగా ఈ మూవీలో పవన్ సరసన
హీరోయిన్ ఉండదు.ఇక ఆయనది దేవుడి టైపు పాత్ర అని తెలుస్తుంది. ఇకపోతే జూలై నుండీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.కాగా 4 నెలల్లోనే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అయితే అంతా అనుకున్నట్టు జరిగితే 2023
సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.