నందమూరి నట సింహం
బాలకృష్ణ ప్రస్తుతం
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రారంభమైన ఈ
సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో
బాలకృష్ణ సరసన
శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో
బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో
బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా, మరొక పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
సినిమా బాలకృష్ణ కెరియర్ లో 107 వ సినిమా కావడంతో ప్రస్తుతం ఈ
సినిమా ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో
వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతుంది. ఇది వరకు
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన
క్రాక్ సినిమాలో
వరలక్ష్మి శరత్ కుమార్ అదిరిపోయే
మాస్ పాత్రలో నటించి ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో దునియా
విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.
ప్రస్తుతం ఈ
మూవీ టీజర్ అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను సాధిస్తూ దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా విడుదల విషయంలో ఈ
మూవీ మేకర్స్ పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ
సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి, అంతే వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించి దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఈ
మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.