టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన వరుణ్ తేజ్ కొన్ని రోజుల క్రితమే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడి బాడీ ని కూడా బాగా బిల్డ్ చేసుకున్నాడు. కాకపోతే ఈ సినిమా వరుణ్ తేజ్ కు బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మామూలు రేంజ్ కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర రాబట్టలేకపోయింది. ఇలా గని సినిమాతో భారీ ప్లాప్ ని బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్న వరుణ్ తేజ్ తాజాగా ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ గా తెరకెక్కిన ఎఫ్ 3 మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర రాబట్టుతుంది. ప్రస్తుతం కూడా ఆఫ్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా గని లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత ఎక్కువ టైం గ్యాప్ లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫ్ 3 మూవీ తో హిట్ ను అందుకున్న వరుణ్ తేజ్ మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరైన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.
ఈ సినిమాను ప్రవీణ్ సత్తార్ భారీ యాక్షన్ మూవీ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ప్రస్తుతం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రవీణ్ సత్తార్ ప్రస్తుతం నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో ప్రవీణ్ సత్తారు సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అలాగే ప్రవీణ్ సత్తార్ 'జీ 5' లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.