
పవన్ కళ్యాణ్ తో నటించనున్న సల్మాన్ ఖాన్...!!
ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాల ఫలితాల విషయంలో ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారట . ఒకవైపు అన్న సినిమాలో నటిస్తున్న సల్మాన్ ఖాన్ మరోవైపు తమ్ముడి సినిమాలో కూడా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలతో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి మరి.వెంకటేష్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ వరుసగా సౌత్ హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
మరోవైపు భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ కు సంబంధించి దర్శకుని నుంచి క్లారిటీ కూడా రావాల్సి ఉంది. మొదట పవన్ లేని సన్నివేశాలతో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేసి తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారట.. హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందనే విషయం తెలిసిందే.
డైరెక్టర్ క్రిష్ భవిష్యత్తు ఈ సినిమాపైనే ఆధారపడి ఉందట.. పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ కూడా మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. పవన్ ఈ సినిమాలను పూర్తి చేసి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారట..