రాత్రిపూట దొంగతనాలు చేస్తున్న రవితేజ..!

frame రాత్రిపూట దొంగతనాలు చేస్తున్న రవితేజ..!

Pulgam Srinivas
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . స్టూవర్టుపురం దొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితం నేపథ్యం లో ఈ మూవీ రూపొందుతోంది . ఈ మూవీ లోని పాత్ర కోసం మాస్ మహారాజ రవి తేజ తన బాడీ లాంగ్వేజ్ ను కూడా ఇప్పటికే మార్చు కున్నాడు.


ఈ మూవీ లో రవితేజ దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీ లో రవితేజ సంభాషణలు కూడా వినూత్న రీతిలో ఉండను నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తూన్నారు .  టైగర్ నాగేశ్వర్ రావు మూవీ  తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.  రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన టైగర్ నాగేశ్వర్ రావు మూవీ చిత్రీకరణ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు మూవీ కి సంబంధించిన నైట్ షూట్ లు జరుగుతున్నాయి. ఈ నైట్ షూట్ లో జరుగుతున్న సందడిని రవితేజ వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.


ప్రస్తుతం రాత్రి పూట దొంగతనానికి సంబంధించిన సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ లో రవితేజ సరసన నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ఈ మూవీ కి అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. రవితేజ ఈ మూవీ తో పాటు ధమాకా ,  రావణాసుర  మూవీ లలో కూడా హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: