అనన్యా అందాలకు ఆడియెన్స్ క్లీన్ బౌల్డ్..!
అయితే వకీల్ సాబ్ లో చేసిన పాత్రల తరహాల్లోనే అవకాశాలు వస్తుండటంతో ప్రస్తుతం వాటిని హోల్డ్ లో పెట్టిందట అమ్మడు. సోలో హీరోయిన్ ఛాన్సు ల కోసం ఎదురుచూస్తున్న అనన్యా నాగల్ల ఫ్రీ టైం లో తన ఫాలోవర్స్ ని అలరించేందుకు హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. వారానికి ఓ ఫోటో షూట్ తో ఆకట్టుకుంటున్న అనన్యా లేటెస్ట్ గా మరో హాట్ ఫోటో షూట్ తో వచ్చింది. తన క్యూట్ లుక్స్ తో లోపల అందాలు కనిపించేలా అనన్యా హాట్ షో అదిరిపోయింది.
సరైన ఛాన్స్ వస్తే అమ్మడు ఓ ఊపు ఊపేలా ఉందని చెప్పొచ్చు. తెలుగు అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఇంకా మన దర్శక నిర్మాతల దృష్టి లో అమ్మడు పడలేదని చెప్పొచ్చు. అందుకే ప్రస్తుతం ఖాళీ టైం లో ఫోటో షూట్స్ తో కాలం గడిపేస్తుంది. ఏది ఏమైనా అనన్యా అందాలకు ఆడియెన్స్ మాత్రం క్లీన్ బౌల్డ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు లో శాకుంతలం సినిమాలో అమ్మడు నటిస్తుంది. మరి అమ్మడికి సోలో హీరోయిన్ గా ఏ దర్శకుడు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. అనన్యా మాత్రం ఓ మంచి అవకాశం కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది.