ప్రస్తుతం వరస హిట్లతో దూసుకుపోతున్నాడు టాలెంటెడ్
డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఇకపోతే తాజాగా ఈయన దర్శకత్వంలో
బాలయ్య సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ విషయాన్ని ఎఫ్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.అయితే
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో
కామెడీ డోస్ ఉంటుంది...అంతేకాదు ఈ
సినిమా పూర్తి ఎంటర్టైనర్ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. పొతే
బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నామని
అనిల్ రావిపూడి తెలిపారు. అంతేకాకుండా ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం గురించి టైటిల్ అంటూ ఒకటి బయిటకు వచ్చింది.ఇక ఆ సినిమాకు టైటిల్ గా బ్రో ఐ డోంట్ కేర్....అని ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా
అనీల్ రావిపూడి రాసుకున్న కథకు ఈ టైటిల్ ఫెరఫెక్ట్ అని చెప్తున్నారు.పోగా ఈ సినిమాకు మొదట ఐ డోంట్ కేర్ అని అనుకున్నారట.ఇక ఆ తర్వాత 'Bro' అని యాడ్ చేసినట్లు చెప్తన్నారు. తాజాగా ఇప్పుడు ఈ టైటిల్ జనాల్లోకి బాగా వెళ్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే `సెప్టెంబర్-
అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్తాం.కాగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణం.అయితే
బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే
సినిమా ఉంటుంది.
ఇకపోతే ఫన్ ఉంటుంది కానీ అంత బిగ్గర్ గా ఉండదు. కాగా ఇందులో నాతో పాటు బాలయ్యను కూడా కొత్తగా చూస్తారు. అయితే మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ లోకి వస్తాం.అంతేకాదు ` అని
అనిల్ రావిపూడి చెప్పడంతో వీరి కాంబో ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.అయితే
అనిల్ రావిపూడి -
బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలో
సినిమా అంటే ఆ
సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్
డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇదిలావుంటే ఈ
మూవీ కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. ఇక ఇందులో
బాలయ్య కూతురిగా శ్రీలీల నటించబోతోంది.