ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో థియేటర్స్‌లో తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ వసూళ్ళని నమోదు చేస్తూ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.సూపర్ మహేష్ బాబు పర్‌ఫార్మెన్స్‌తో పాటు మిగతా నటీనటుల పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంది.ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న యస్ యస్ రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు.మహేష్ బాబుకు జోడీగా నటించే హీరోయిన్ కోసం చాలా ఆప్షన్లు తీసుకున్నాడట. అందులో ఎవరు అయితే బాగుంటారా అని చూస్తున్నాడట రాజమౌళి.ఈ లిస్ట్ లో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఉన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుబోతున్న పాన్ ఇండియా సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో ఫిక్సైన ప్రాజెక్ట్ కూడా ఒకటి.గత కొన్నేళ్ళుగా ఈ సినిమాకోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇంకా దేశమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
దాదాపు పదేళ్ల క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేయాలని అనుకున్నారు. కానీ, ఇద్దరు మిగతా ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇన్నేళ్ళ సమయం పట్టింది. ప్రముఖ సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ , శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు.ఈ సినిమా చెయ్యడం మహేష్ బాబుకి డ్రీం అట. అందుకే సినిమా కోసం రాజమౌళి ఇప్పటినుంచే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టె కథని సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యాడట. ఇక ఒక వన్ మంత్ లో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా కూడా ఒక రేంజిలో సిద్ధం చేస్తున్నాడట త్రివిక్రమ్. ఆ సినిమా అయ్యాక రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.