'మేజర్' సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన విజయ్ దేవరకొండ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.


ఈ సినిమా విడుదల కాకముందే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా లో కూడా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. జనగణమన సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యింది.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ , శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ మేజర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. అడవి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది .


ఇప్పటికే ఈ సినిమాపై ఎంతో మంది సెలబ్రెటీలు ప్రశంసల వర్షం కురిపించగా,  తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. మేజర్ మూవీ ని అభిరుచి, ప్రేమ, చిత్తశుద్ది తో తెరకెక్కించారు అని విజయ్ దేవరకొండ అన్నారు. అలాగే అందరం చూసి నేర్చుకోవాల్సిన మనిషి, ఒక ట్రూ ఐడల్ అని విజయ్ దేవరకండ కొనియాడారు. మన హీరో గురించి తెలుసుకోవాలని అనుకుంటే కచ్చితంగా ఇది చూడండి అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. అంతేకాక మేజర్ తల్లిదండ్రులకు నా హృదయ పూర్వక గౌరవం మరియు ప్రేమ అని విజయ్  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: