త్రివిక్రమ్ పై ఫైర్ అయిన పూజా హెగ్డే.. కారణం అదేనా..?

Anilkumar
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ తెలిసిందే.ఇదిలావుండగా ఇప్పుడు ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు.ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి.అయితే ప్రస్తుతం హాలిడే ట్రిప్ ని విదేశాలలో ఫామిలీ తో పాటు ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, ఇండియా కి తిరిగి రాగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట.ఇక ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఇకపోతే  తాజాగా అందుతున్న సమాచారం ఏమిటి అంటే పూజ హెగ్డే ని ఈ సినిమా నుండి తొలగించి ప్రియాంక అరుళ్ మోహన్ ని హీరోయిన్ గా...


 తీసుకునేందుకు ఆలోచిస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ ని ఈ సినిమాలో నటింప చేస్తే సినిమాకి ఒక్క కొత్త ఫ్రెష్ లుక్ వస్తుంది అని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న పూజ హెగ్డే త్రివిక్రమ్ పై తీవ్రమైన అసహనం తో ఉన్నట్టు తెలుస్తుంది.అయితే నమ్మి కాల్ షీట్స్ ఇస్తే ఇలా చెప్పాపెట్టకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు ....అని పూజ హెగ్డే గొడవ చేసినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం.అయితే గతం లో కూడా అరవింద సమేత సినిమా కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని తీసుకున్నాడు త్రివిక్రమ్.ఇకపోతే గతం వీళ్లిద్దరి కాంబినేషన్ అజ్ఞాతవాసి చిత్రం వచ్చింది.


ఇక ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యేలోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనిరుధ్ ని పక్కన పెట్టి థమన్ ని తీసుకున్నాడు.ఇకపోతే సమె అదే ఫార్ములా ని పూజ హెగ్డే విషయం లో కూడా వాడుతున్నాడట మన త్రివిక్రమ్ .కాగా పూజ హెగ్డే ఇటీవల కాలం లో నటించిన సినిమాలు అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.ఇక ఆమె ప్రస్తుతం హిట్స్ లో లేదు కాబట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.ఇకపోతే ఇవి అన్ని గమనిస్తూ ఉంటె త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్స్ లో ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు అని అర్థం అవుతుంది.... అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: