'ఆర్ ఆర్ ఆర్'
సినిమా తో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు
రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని
సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో
సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ
సినిమా కథ ఉండబోతుందట. ఆఫ్రికన్ అడవులు నేపథ్యంలో అడ్వెంచర్ సినిమాగా మహేష్ బాబు సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్తో పాన్
ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
అయితే ఈ బడా ప్రాజెక్టుల్లో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే ఈ విషయంలో కూడా అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టు లో అవకాశం వస్తే ఏ
హీరోయిన్ అయినా మిగతా ప్రాజెక్టులన్నీ వదులుకొని మహేష్ సినిమాకి ఓకే చెప్తారు. అయితే ఈ
సినిమా కోసం
రాజమౌళి ఇప్పటికే కొంతమంది హీరోయిన్లను పరిశీలించినట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే తాజాగా
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం
బాలీవుడ్ బ్యూటీ
శ్రద్ధా కపూర్ పేరు ప్రస్తావన లోకి వచ్చినట్లుగా సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే ఈ
బాలీవుడ్ బ్యూటీ యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
కేవలం
రొమాంటిక్ సన్నివేశాల్లోనే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో కూడా చాలా బాగా నటించింది
శ్రద్ధా కపూర్. ఇక ఇప్పుడు మహేష్ బాబు
రాజమౌళి కలయికలో రాబోయే
సినిమా కోసం కూడా ఈ
బాలీవుడ్ భామ కి దాదాపు ఇదే క్యారెక్టర్
రాజమౌళి ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే మహేష్
హీరోయిన్ గా
శ్రద్ధా కపూర్ ఫిక్సైనట్లు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసేందుకు వేచిచూడాల్సిందే. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ
సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం...!!