ప్రస్తుతం
బాలీవుడ్ హీరోయిన్
కియారా అద్వానీ వరుస సినిమాలతో బిజీ గా గడిపేస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ అమ్మడు మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్,
శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.అయితే అంతేకాదు హిందీలో భుల్ భూలయ్యా సినిమాకు సిక్వెల్ గా వచ్చిన భూల్ భూలయ్యా 2 చిత్రంలో నటించింది. ఇకపోతే
కార్తిక్ ఆర్యన్,
కియారా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబు,
రాజ్ పాల్ యాదవ్ కీలకపాత్రలలో నటించారు.
ఇక ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లపై భూషణ్ కుమార్,
క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, అంజుమ్ ఖేతాని కలిసి....
నిర్మించడం జరిగింది.తాజాగా ఇప్పుడు ఈ
సినిమా ప్రమోషనల్లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గోన్న
కియారా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.అయితే
కియారా తన
కాలేజీ రోజులలో తన స్నేహితులతో కలిసి మెక్లియోడ్ గంజ్ ధర్మశాలలో ఉన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకోవడం జరిగింది.ఇక ఆ సమయంలో విపరీతమైన మంచు కురవడం.. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలు ఉండడంతో నీరు,
విద్యుత్ లేకుండా దాదాపు నాలుగు రోజులు ఓ హోటల్లో చిక్కుకున్నారని తెలిపింది.ఇకపోతే ఈ హోటల్ గదిలో నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి తమ పక్కనే ఉన్న కుర్చీకి ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని..తన స్నేహితురాలు మేల్కోని పెద్దగా అరిచి అందరిని నిద్రలేపిందని..
అంతేకాదు... ఇక దీంతో అందరూ ఆ మంటలకు దూరంగా పరిగెత్తామని తెలిపింది.అయితే అలా మంటలు అంటుకున్న సమయంలో చావును దగ్గరి నుంచి చూసినట్లు అనిపించిందని.. ఇక ఆ ప్రమాదంలో తనతో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదని.. అయితే...తనకు ఎప్పటికీ ఆ సంఘటన చాలా బాధాకరమైన అనుభవం అంటూ చెప్పుకొచ్చింది ఈమె. అంతేకాకుండా అలాగే.. తాను
పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలనే విషయం గురించి స్పష్టతనిచ్చింది ఈ చిన్నది.. ఏంటంటే ...అర్థం చేసుకోవడం.. గౌరవం, విధేయత, కామెడీ.. నమ్మకం..ఈమె ఇలా అన్నింటిలోనూ తనను తాను ప్రేమించినట్లుగా.. చూసినట్లుగా.. విన్నట్లుగా అనిపించేలా ఉండే వ్యక్తిని కోరుకుంటున్నట్లు చెప్పడం జరిగింది.