'ఎన్టీఆర్ సీఎం కాదు.. పవన్ కళ్యాణ్ సీఎం'.. ఫ్యాన్స్ మధ్య గొడవ.. కానీ చివరికి..?

Anilkumar
స్టార్ హీరోలకు ఉండే అభిమానుల అభిమానం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.అయితే నిజానికి హీరోలు-హీరోయిన్లు బాగానే ఉంటారు ....కానీ హీరోల అభిమానులే ప్రతి చిన్న దానికి పెద్ద గొడవ చేసి దానిని బాగా ట్రెండ్ చేస్తారు.అయితే ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి పలువురు స్టార్ హీరోల అభిమానులు చాలాసార్లు ఏదో ఒక వివాదాన్ని సృష్టించారు.ఇదిలావుంటే  తాజాగా మరో ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు కూడా పెద్ద గొడవ చేశారు. ఇకపోతే మామూలుగా అభిమానులు తమ అభిమాన హీరో కోసం సినిమా విషయాల్లో గొడవ పడతారని తెలుసు.అయితే  కానీ .....కొందరు అభిమానులు మాత్రం రాజకీయ పరంగా కూడా గొడవ పడతారు.


కాగా గతంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి విషయంలో కూడా ఆయన అభిమానులు రాజకీయ పరంగా బాగా వివాదం సృష్టించారు. అయితే....అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆయనను రాజకీయ పరంగా మధ్యలోకి లాగుతూ సంచలనం సృష్టించారు. ఇక దాంతో ఎన్టీఆర్ అప్పుడే ఆ విషయం గురించి స్పందించి గొడవను సద్దుమణిగేలా చేశాడు.అసలు విషయం ఏమిటంటే తాజాగా ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద వివాదం సృష్టించారు.అంతేకాదు  తాజాగా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో మహంకాళి అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.


అయితే ఈ సందర్భంగా అక్కడున్న ఈ స్టార్ హీరోల అభిమానులు.. తమ అభిమాన హీరోలు అయిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా ఆ ఫ్లెక్సీ లకు పాలాభిషేకం కూడా చేశారు అభిమానులు. ఇక దీంతో సీఎం పవన్ కళ్యాణ్, సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇద్దరి అభిమానుల మధ్య జోరుగా నినాదాలు జరిగాయి.అయితే దీంతో మా హీరోనే సీఎం అంటూ కాదు మా హీరో నే సీఎం అంటూ బాగా వివాదం సృష్టించారు. ఇక ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకొని పెద్ద గొడవ చేశారు.  అక్కడున్న స్థానికులు ఈ విషయం గురించి పోలీసులకు తెలియజేయడంతో.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అక్కడున్న గొడవని సద్దుమణిగేలా చేశారు.ఇదిలావుంటే ప్రస్తుతం ఇప్పుడు వారిపై పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: