టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళిని ఒకరు.ఈయన భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు అభిమానిస్తారు.ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాలు ఇతర భాషల్లో కూడా రికార్డుస్థాయిలో కలెక్షన్లను సాధించాయి.అయితే అసలు విషయం ఏమిటంటే తన ఫేవరెట్
హీరో ఎవరనే ప్రశ్నకు
జక్కన్న మాత్రం ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా జవాబిచ్చారు. కాగా
రాజమౌళి ఫేవరెట్
హీరో ఎవరనే ప్రశ్నకు ఇచ్చిన జవాబులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో
రాజమౌళి తన ఫేవరెట్
హీరో ఎవరో పబ్లిక్ గా చెప్పేంత మూర్ఖుడిని తాను కాదని అన్నారు.