మరోసారి రెచ్చిపోయిన రష్మిక..!
ఇవే కాదు బాలీవుడ్ లో కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది అమ్మడు. చేస్తున్న సినిమాల్లో తన మార్క్ చూపిస్తూ వస్తున్న రష్మిక మరోపక్క ఫోటో షూట్ తో కూడా ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా అమ్మడు ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కవర్ పేజ్ పై హాట్ స్టిల్ తో అదరగొడుతుంది. అభినయంలో అలరించడమే కాదు హాట్ షో లో అదరగొట్టడం కూడా తెలిసిన ఈ అమ్మడు సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో కూడా తన ప్రత్యేకత చాటుకుంటుంది.
బాలీవుడ్ లో ఒక సినిమా చేయకుండానే నేషనల్ క్రష్ గా మారిన రష్మిక అక్కడ సినిమాలు చేసి మరింత క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. అందుకే బాలీవుడ్ పార్టీల్లో కూడా తరచు పాల్గొంటుంది అమ్మడు. లేటెస్ట్ ఫిల్మ్ కేర్ మేగజైన్ స్టిల్ మాత్రం రష్మిక ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మడు చేస్తున్న ఈ హంగామా ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. పుష్ప 2, విజయ్ 66వ సినిమాలతో పాటు హిందీ సినిమాలు ఆమె లిస్ట్ లో ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమాలతో రష్మిక మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకుంటుందని చెప్పొచ్చు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా రష్మిక వరుస ఛాన్సులు అందుకుంటుంది.