మన హీరోలలో అంత మార్పేంటి గురూ?

P.Nishanth Kumar
ఈ మధ్య సినిమా విడుదలలు ఎక్కువైపోతున్నాయి. అందరి నిర్మాతలు కూడా తమ సినిమాలను థియేటర్ లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటికి సంభందించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఎంతో వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒక్కొక్కరు ఒక్కో విధమైన ప్రమోషన్ స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రమోషన్స్ లో సరిగ్గా పాల్గొనని మన హీరోలు ఇప్పుడు ప్రమోషన్స్ లో ఏకంగా డాన్స్ లు వేయడం అందరిని ఎంతో ఆశ్చర్య పరుస్తుంది.
ఇటీవలే థియేటర్ లలో విడుదల ఘనవిజయం సాధించిన సర్కార్ వారి పాట సినిమా ప్రమోషన్ సందర్భంగా మహేష్ బాబు డాన్స్ వేయడం అందరిని ఎంతో ఖుషీ చేసింది. గతంలో ఎంతో మొహమాటంగా ఉండే ఈ హీరో ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు అనుకుంటూ ఉండగానే ఇప్పుడు ఏకంగా స్టేజి పైన స్టెప్పులు వేయడం అందరిని సంతోషంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే మహేష్ ఒక్కడే కాదు మరో ఇద్దరు హీరోలు కూడా ఈ విధంగా స్టేజి మీద స్టెప్పులు వేయడం అందరిని మరింత ఆనందపరుస్తుంది.
ఎఫ్ 3 సినిమా సక్సెస్ అయినా సందర్భంగా వైజాగ్ లో ఈ సినిమా యొక్క సక్సెస్ సెలెబ్రేషన్స్ ను జరుపుకుంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరో లు దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి స్టేజి మీద స్టెప్పులు వేయడం అక్కడి అభిమానులను ఎంతో అలరించింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ స్టెప్పులు వేయడం సినిమా పరిశ్రమకి మంచి పరిణామం అని చెప్పాలి. గతంలో ఈ స్థాయి లో హీరో లు ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఇప్పుడు ఇలాంటి ధోరణి మన హీరోల లో కనిపించడం మంచి విషయం. మరి రానున్న సినిమాల హీరో లు ఏ విధమైన జోష్ ను ప్రేక్షకుల్ నింపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: