ఇక రీసెంట్ గా ప్రభాస్ కు మరో బిగ్ ప్రాబ్లమ్ తెచ్చిపెట్టారు ఆది పురుష్ సినిమా నిర్మాతలు.బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పెద్ద పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్..ఇప్పుడు ఏ సినిమా తీసిన కూడా ఆ రేంజ్ లోనే ఉండేలా చూసుకుంటున్నాడు. పాన్ ఇండియా సినిమా 'సలార్', ఇంకా అలాగే ప్రాజెక్ట్ K షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అయితే, ఆయన ఆల్రెడీ నటించిన పాన్ ఇండియా సినిమా "ఆది పురుష్" సినిమాకి సంబంధించి ఇప్పటీ వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వ లేదు..ఏవో కొన్ని లుక్స్ బయటకు వచ్చినా కానీ దాంతో ఫ్యాన్స్ సంతృప్తి పడలేదు.దీంతో సినిమా డైరెక్టర్ ఓం రౌత్ మీద ఫైర్ అవుతూనే ఉన్నారు ఆయన ఫ్యాన్స్. మన రామాయణంలోని ఓ ఘట్టం ఆధారంగా ఆదిపురుష్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా. ప్రతినాయకుడు రావణుడి రోల్లో బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ ఆలీఖాన్ నటించాడ. 'ఆదిపురుష్' సినిమాను అనౌన్స్ చేసి ఇప్పటికి రెండేళ్లు అవుతుంది. ఇప్పటిదాకా సినిమాకి సంబంధించి కీలక అప్డేట్స్ అసలు ఏం ఇవ్వలేదు.
కానీ, సినిమా టికెట్ల విషయంలో మాత్రం నిర్మాతలు ఎన్నో సంచలన కామెంట్స్ చేశారు.2023 సంక్రాంతికి విడుదల అవన్నున్న ఈ సినిమా టికెట్స్ ధరల పై ఆది పురుష్ నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ కూడా కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా టికెట్ల ధరలు ఉండబోతున్నాయని ఆయన ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులకు బాగా మండిపోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వండి రా అంటే..మీకు లాభాలు వచ్చే టికెట్ల గురించి మాత్రం చెప్పుతున్నారు ఏంటి అంటూ మండిపడుతున్నారు. పైగా సినిమా బడ్జెట్ గురించి, బిజినెస్ గురించి ఇంకా ఇలా ఘనంగా స్టేట్మెంట్స్ ఇచ్చినా పర్లేదు కానీ, టికెట్ల ధరలు భారీగా ఉండబోతున్నాయని చెప్పి షాక్ ఇవ్వడం ఏంటి రా సామీ అంటూ బండ బుతులు తిడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.