కమలహాసన్ కు ధియేటర్ కష్టాలు !
గత 5సంవత్సరాలుగా సక్సస్ అన్న పదానికి దూరంగా ఉన్న కమలహాసన్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. ఈ మూవీ ‘మేజర్’ తో పోటీ పడకుండా విడిగా వచ్చి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బష్టర్ హిట్ పడి ఉండేది. ఇప్పుడు ‘మేజర్’ మూవీ కూడ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సగటు ప్రేక్షకుడు ఈ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమాను ఈ వీకెండ్ లో ఎంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ మూవీని ప్రమోట్ చేస్తూ కమల్ వరసపెట్టి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన కెరియర్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను ఇప్పటివరకు 232 సినిమాలలో నటించినప్పటికీ తనకు తాను చేసిన కేవలం 50 – 60 సినిమాలు మాత్రమే మిగతా సినిమాలలోని తన పాత్రలు రొటీన్ అనిపిస్తాయని కామెంట్స్ చేసాడు.
అంతేకాదు తనకు ఛాలెంజ్ గా అనిపించే పాత్రలు చేసినప్పుడు వచ్చే అనుభూతి రొటీన్ సినిమాలలో తనకు కనిపించదు అంటూ కామెంట్ చేసాడు. అయితే తనకు ఇప్పుడు ఒక హిట్ కావాలని హిట్ లేకపోతే ఇండస్ట్రీ తనను గుర్తించదని జోక్ చేసాడు. ప్రేక్షకులతో కలిసి కూర్చుని సినిమా చూడాలని తన కోరిక అయినప్పటికీ తన కోరిక ఇప్పటి వరకు నెరవేరలేదు అంటున్నాడు.
అదేవిధంగా తనకు రజినీకాంత్ తో కలిసి మళ్ళీ నటించాలి అన్న కోరిక ఉందని ఈమధ్య తాను రజినీకాంత్ ఇంటికి లంచ్ కి వెళ్ళినప్పుడు ఇదే విషయం తనకు చెప్పానని అంటున్నాడు. తనను అదేవిధంగా రజినీకాంత్ ను తిడుతూ తమకు నటన నేర్పిన బాలచందర్ లేకుంటే తామిద్దరం ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు అని అంటున్నారు. ‘విక్రమ్’ సక్సస్ అయితే తనకు మరింత ధైర్యం చేసి మరిన్ని ప్రయోగాలు చేయడానికి తాను సిద్ధం అంటున్నాడు. ఈ మూవీ సక్సస్ తో కమల్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు కాబట్టి మరిన్ని మంచి సినిమాలు వచ్చే ఆస్కారం..