వారెవ్వా.. విజయ్ తో ఆ హీరోయిన్ మరోసారి?

praveen
విడాకుల తర్వాత సమంత కెరియర్ దెబ్బతింటుందని అందరూ అనుకున్నారు. అవకాశాలు రాక ఇబ్బంది పడుతుందని ఎంతోమంది భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారయ్యాయి. విడాకుల తర్వాత కూడా సమంతకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది సమంత. ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాతో పాటు సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న యశోద అనే సినిమాలో నటిస్తోంది అనే విషయం తెలిసిందే.

 ఈ సినిమాతో పాటు అటు విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరి కొన్ని సినిమాలను కూడా సైన్ చేసి బిజీ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడూ సమంతా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది అన్నది తెలుస్తుంది. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తో మరో సారి జోడి కట్టేందుకు సిద్ధమైంది సమంత. ఇప్పటికే విజయ్ దళపతి తో పోలీసోడు అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్అయింది. ఇక పోలీసోడు సినిమా మంచి విజయాన్ని సాధించింది.

 ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి విజయ్ దళపతి తో జోడి కట్టేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. విక్రమ్ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు తన తర్వాతి సినిమాను విజయ్ తో చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇందులో హీరోయిన్ గా సమంత అయితే బాగుంటుందని అనుకున్నారట. సమత ను సంప్రదిస్తే ఓకే చెప్పేసిందట ఈ ముద్దుగుమ్మ. అయితే లోకేష్ గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతోనే సమంత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: