ఎమోషనల్ తో కూడిన మేజర్ చిత్రం.. ఎలా ఉందంటే..!!

Divya
మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పేరు పొందింది మేజర్. ఈ సినిమా 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులు వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం ఈ రోజున అన్ని భాషలలో ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో టాలీవుడ్ హీరో అడవి శేషు నటించారు. ఇక ఈయన తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతి ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో నిర్మించారు. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు సొంత నిర్మాణంలో నిర్మించడం జరిగింది.

ఇక ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్ కీలకమైన పాత్రలో నటించారు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం వెండితెరపై ఎంతో అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిమానులను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మేజర్ అంటే సినిమా కాదని ఒక ఎమోషనల్ మేజర్ సినిమా క్లైమాక్స్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు. అడవి శేషు ఎంతో అద్భుతంగా నటించారని డైరెక్టర్ దర్శకత్వం బాగుందని కూడా కామెంట్ చేస్తున్నారు.


మేజర్ ఎమోషనల్ క్లైమాక్స్ తో అద్భుతంగా తెరకెక్కించారు మొత్తం తారాగణం అద్భుతమైన ప్రదర్శన చేశారు.. సినిమాటోగ్రఫీ బిజిఎం ఎంతో బాగా నచ్చిందని ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం తో కూడా హీరో అడవి శేషు మరొక ఘన విజయాన్ని అందుకున్నారు అని చెప్పవచ్చు. ఇక దీంతో అడవి శేషు తను కొన్ని సందీప్ ఉన్నికృష్ణన్.. తల్లిదండ్రులకు కూడా కుమారుడినే అని కూడా తెలియజేశారు. ఏది ఏమైనా ఇలాంటి చిత్రాలు తీయడం ఎంతో అద్భుతం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: