ప్రపంచవ్యాప్తంగా అన్ని కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచిన శివ కార్తికేయన్ 'డాన్'..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ తాజాగా సీబీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగులో కాలేజ్ డాన్ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా, ఎస్ జే సూర్య , సముద్ర ఖనిమూవీ లో ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో మంచి అంచనాలతోనే విడుదల అయినప్పటికీ , తెలుగులో మాత్రం ఎలాంటి పబ్లిసిటీ లేకుండా చాలా సింపుల్ గా ఈ మూవీ ని విడుదల చేశారు.


ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 1.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 18 రోజులకు గాను కాలేజ్ డాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.12 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేయగా, 4.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలేజ్ డాన్ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని లాభాలను పొందుతోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 43 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుతున్నట్లు తెలుస్తోంది.


ఇలా ఇలా ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ లో జరుపుకున్న శివ కార్తికేయన్ డాన్ మూవీ 18 రోజులకు గాను  57.50 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనితో డాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 13.50 కోట్ల లాభాలను ఇప్పటివరకు పొందినట్లు తెలుస్తోంది. ఇలా డాన్ మూవీ ఇప్పటికే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: