టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా అడవి శేషు గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టిన అడవి శేషు ఆ తర్వాత హీరోగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం మాత్రమే కాకుండా తాను హీరో గా నటించిన ప్రతి సినిమా తోను బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు .
అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న అడవి శేషు తాజాగా మేజర్ సినిమాలో హీరోగా నటించాడు. మేజర్ మూవీ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కడం తో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మేజర్ సినిమాను జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇలా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉన్నా మేజర్ సినిమా విడుదలకు ముందుగానే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షో లను చిత్ర బృందం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరు లో కూడా మేజర్ సినిమా ప్రీమియర్ షో లు నిర్వహించడం జరిగింది .
ఇలా బెంగళూరు లోని ప్రీమియర్ షో లకు సంబంధించిన మేజర్ సినిమా టికెట్ లు కేవలం రెండు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఇలా రెండు నిమిషాల్లోనే ఈ సినిమా టికెట్లు సోల్డ్ ఔట్ అవడంతో ఈ సినిమా కు ఉన్న క్రేజ్ ఏంటో అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఇది ఇలా ఉంటే మేజర్ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా, సాయి మంజ్రేకర్ , శోభితా ధూళిపాళ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.