ప్రభాస్ ఆ డైరెక్టర్ కి నో చెప్పాడా..?

P.Nishanth Kumar
వరుస సినిమాలను ఓకే చేసుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి సలార్ చిత్రం పైనే ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నాడు. ఆయన నటించిన గత రెండు చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ఈ సినిమా ద్వారా వారిని మెప్పించి మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి రావాలని భావిస్తున్నాడు. ఆ విధంగా తనకు నచ్చిన దర్శకులతో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న ప్రభాస్ ఓ హిట్ డైరెక్టర్ రిజెక్ట్ చేశాడు అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఖైదీ మాస్టర్ వంటి చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనక రాజన్ కమల్ హాసన్ తో కలిసి విక్రమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం అయ్యాడు. జూన్ 3వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కోసం హైదరబాద్ కు చేరుకున్న ఈ దర్శకుడు ప్రభాస్ ను కలిసి ఓ స్టోరీని వినిపించాడట. అయితే ఈ ఐడియాను నచ్చని ప్రభాస్ ఈ సినిమా తాను చేయని సున్నితంగా తిరస్కరించారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో కు విక్రమ్ ఖైదీ మాస్టర్ లాంటి తరహాలో చిన్న యాక్షన్ స్టోరీ వినిపించడంతో ప్రభాస్ కు ఈ సినిమా నచ్చలేదు అని ఆయన సన్నిహితులు అంటున్నారు. తనకు యాక్షన్ డ్రామా కథలు అవసరం లేదని వెరైటీ కథలు ఉంటే చెప్పమని ప్రభాస్ దర్శకుడుకి వెల్లడించారు. మరి భవిష్యత్తులో ప్రభాస్ మెచ్చే కథలు వినిపించి ఆయనతో సినిమా చేయాలనే కోరికను లోకేష్ నెరవేర్చుకుంటాడా అనేది చూడాలి. ఇక విక్రమ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు లోకేష్. ఈ సినిమా ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: