కే జి ఎఫ్ ఫ్యాన్ కు గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్..!!

Divya
రాఖీ బాయ్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది హీరో యష్. తను నటించిన తాజా చిత్రం కే జి ఎఫ్-2 తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ కు కూడా భారీ స్థాయిలో పాపులారిటీ రావడం జరిగింది. ఈ చిత్రం ఒకేసారి ఐదు భాషల్లో విడుదలై మంచి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విడుదలై నెల దాటినప్పటికీ ఇప్పటికీ సినిమా హవా కొనసాగుతూనే ఉన్నది. ఇక తెలుగు రాష్ట్రాలలో పాటు కన్నడలో కూడా ఈ సినిమా రికార్డులను సైతం తిరగ రాయడం జరిగింది. ఇక ఉత్తరాదిలో కూడా 400 కోట్లకు మించి వసూలు రాబట్టినట్లుగా సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్లకు మించి వసూలు రాబట్టినట్లుగా తెలుస్తోంది.


ఇక ఈ చిత్రం బుక్మైషో లో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా పేరు సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం మొదలు పెట్టారు. థియేటర్లలో రన్ అవుతున్న కూడా ఈ మూవీను ఓటిటి లో చూడడానికి చాలా మంది ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైలెంటుగా స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా చూడాలంటే కచ్చితంగా రూ.199 రూపాయలు కట్టాల్సిందే అన్నట్లుగా నిబంధనలు పెట్టి అందరికీ గట్టి షాక్ ఇచ్చింది.


అయితే ఒక ఏడాది కి రూ.1499 రూపాయలు పే చేసి తమకు అమెజాన్ ఇలా చేయడం నచ్చలేదని పలువురు అమెజాన్ యూజర్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా సరే కొంతమంది మాత్రం అవేమీ పట్టించుకోకుండా kgf-2 సినిమా చూసే కి సిద్ధ పడ్డారు. కానీ తాజాగా అమెజాన్ ప్రైమ్ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జూన్ 3వ తేదీ నుంచి ప్రతి ఒక్క అమెజాన్ యూజర్స్కు ఈ సినిమా ఫ్రీగానే చూడవచ్చని గుడ్ న్యూస్ తెలియజేసింది దీంతో యష్ అభిమానులు కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: