పవర్ స్టార్ : అటు ఫ్యాన్స్, ఇటు జనసైనికుల అసంతృప్తి!

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన టాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ హీరోలలో ఒకడు అనడంలో అసలు ఏమాత్రం కూడా సందేహం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు కూడా మినిమం 30 నుండి 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునేంత స్టార్ డమ్‌ ఉన్న హీరో. అలాంటి స్టార్ హీరో జనసేన పార్టీ ఏర్పాటు చేసి వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. ఒక వైపు హీరోగా తన సినిమాలు చేస్తూనే మరో వైపు పార్టీ అధినేతగా కూడా కొనసాగుతూ రెండు పడవల ప్రయాణం ను ఎనిమిది సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు. ఇక ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఆయన పెద్దగా రాజకీయాల్లో కూడా రాణించింది లేదు. అయితే పార్టీని మాత్రం బలోపేతం చేశాడు. గత ఎన్నికల్లో కూడా ఆయనకు ప్రజలు నమ్మి ఓట్లు వేయలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గౌరవ ప్రథమైన సీట్లను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అలాగే మరో వైపు హీరోగా కూడా సినిమాలు అయితే చేస్తున్నాడు కాని అభిమానులను మాత్రం అసలు పూర్తి స్థాయిలో సంతృప్తి పర్చడం లేదు అనేది విమర్శ.




ఇక రాజకీయంగా తాను బిజీగా ఉన్నా కూడా సినిమాలు చేయడం పట్ల అభిమానులు చాలా సంతోషంగా ఉన్నా  సినిమాలను రెగ్యులర్ గా చేయకుండా ఒక్క రోజు షూటింగ్‌ లో పాల్గొంటే మూడు రోజుల పాటు రాజకీయాల్లో ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే మరో వైపు విపక్ష పార్టీల వారు పవన్‌ కళ్యాణ్ సినిమా ల్లో నటించడంతోనే చాలా బిజీగా ఉన్నాడు. ప్రజలను ఇంకా అలాగే పార్టీని ఆయన చూసుకుంటాడా అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందుకే పవన్‌ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం పై ఆయన అభిమానులు ఇంకా అలాగే జనసైనికులు కొందరు అసంతృప్తితో ఉన్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు తప్ప నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం సరైన లాభాలు ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: