టాలీవుడ్ పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా రాధే
శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ప్రస్తుతం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్,
నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్టు కె అలాగే దర్శకత్వంలో ఓం రావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక త్వరలోనే దర్శకుడు
మారుతి తో కలిసి మరో సినిమాను పట్టా లెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది.
రాజా డీలక్స్ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో
ప్రభాస్ కి జోడీగా అనుష్కను
హీరోయిన్ గా చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే
ప్రభాస్ సరసన ఈ సినిమాలో పలువురు హీరోయిన్ల పేర్లు అనుకున్నప్పటికీ చివరకు
అనుష్క పేరునే ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో
హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటం తో చిత్ర బృందం అనుష్కను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఇక
ప్రభాస్ అనుష్క జోడికి వెండితెర పై ఇలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి,
బాహుబలి వంటి సినిమాలు వచ్చాయి.
ఇక ఇప్పుడు
మారుతి సినిమాలో మళ్లీ వీరిద్దరి జోడి జతకట్టనుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్ కామెడీగా తెరకెక్కనున్న ఈ
సినిమా షూటింగ్
సెప్టెంబర్ నెల నుంచి మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసిన మారుతీ నటీనటులను కూడా దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో
బాలీవుడ్ అగ్ర నటుడు బొమన్ ఇరానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో ఈ
సినిమా తెరకెక్కనుంది. ఇక ప్రస్తుతం సలార్
సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ
సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన అనంతరం
మారుతి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!