మహేష్ బాబు మూవీలోని ఆ సాంగ్ ప్రస్తుతం నాకు ఫేవరెట్... శ్రద్దాదాస్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రద్ధాదాస్ , అల్లరి నరేష్ హీరోగా ఈశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాలోనే తన అందచందాలను ఆరబోసిన శ్రద్దాదాస్  తన అందచందాలతో, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది.  


ఆ తర్వాత అనేక సినిమాలలో హీరోయిన్ గా ఇతర పాత్రల్లో నటించి ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్దాదాస్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ కి సంబంధించిన వీడియోను శ్రద్దాదాస్ పోస్ట్ చేయడం జరిగింది.  


ఈ వీడియోలో కళావతి సాంగ్ కు శ్రద్దాదాస్ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. ఈ వీడియోను పోస్ట్ చేయడమే కాకుండా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను కూడా శ్రద్ధా దాస్ ఈ వీడియో కి జోడించింది. కళావతి సాంగ్ ప్రస్తుతం నా ఫేవరెట్  సాంగ్ అంటూ చెప్పుకొచ్చింది.  అలాగే ఈ సాంగ్ ని లూప్ లో వింటూనే ఉన్నట్లు శ్రద్దాదాస్ తెలిపింది. ఈ సాంగ్ లో మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు అని శ్రద్దాదాస్ చెప్పుకొచ్చింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రద్ధాదాస్ లేచింది మహిళా లోకం అనే సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: