"ఎఫ్ 3" చూసినవాళ్లు... 'నారప్ప' చూడాల్సిందే అట?

VAMSI
ఎవరు కూడా స్టార్లు ఊరికే అయిపోరు... ఔను నిజం 'ఎఫ్3' సినిమాలో విక్టరీ వెంకటేష్‌ని చూస్తే ఎవరైనా కచ్చితంగా అలాగే అనుకుంటారు. ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్న వెంకటేష్, విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకోవటమే కాకూండా సుదీర్ఘ కాలంలో తన కెరీర్‌లో వెంకటేష్ అందించిన హిట్స్ అన్నీ ఇన్నీ కావు. అయితే కరోనా కారణంగా రెండు సినిమాల్ని వరుసగా ఓటీటీకే ఇచ్చేయాల్సి రావడంతో, వెంకటేష్ నిజంగానే చాలా బాధపడి ఉంటాడు. అంతేకాదు తెలుగు నాట సాలిడ్ ఫ్యాన్ బేస్ వున్న అగ్ర హీరోల్లో వెంకటేష్ ఒకరు. మరి అంతటి క్రెజ్ ఉన్న ఆయన్ని కనులారా తెరపై చూసేందుకు 'ఎఫ్3' సినిమా అభిమానులకు ఇప్పుడు ఓ సూపర్బ్ ఫీస్ట్ అయ్యింది.
అయితే 'ఎఫ్3' సినిమాని చూసిన వెంకటేష్ అభిమానులు అంతా కూడా ఆ వెంటనే ఓటీటీలో వచ్చిన 'నారప్ప' సినిమాని చూస్తున్నారట. అవును అండి బాబు... ఇది వినడానికి వింతగానే వున్నా.. నిజ్జంగా నిజం, 'నారప్ప' సినిమాలో వెంకటేష్ నటనకు అలాగే  'ఎఫ్3' సినిమా లో నటనకు అస్సలు పొంతన వుండదు. అయినా కూడా ఇంట్లో ఓటీటీ లో వచ్చిన 'నారస్ప' సినిమాని చూస్తూ, అచ్ఛం థియేటర్లలోనే చూస్తున్నట్లుగా ఫీలవుతున్నారట  వెంకటేష్ అభిమానులు. వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా చూసిన తరవాత ఒక్క 'నారప్ప' సినిమా మాత్రమే కాదు, 'దృశ్యం2' సినిమాని కూడా రిపీటెడ్‌గా చూస్తూ విక్టరీ వెంకటేష్  నటనను అభినందిస్తున్నారట అభిమానులు. అదీ కూడా 'ఎఫ్3' సినిమా చుసిన తరువాతనే ఆలా చేస్తున్నారట.
కాగా ఈ  మొత్తం హేంగోవర్ నుంచి బయటపడేందుకు మళ్ళీ మళ్ళీ 'ఎఫ్3'ని చూస్తున్నారు. అయితే  వెంకేష్  'ఎఫ్3' సినిమాలో అంతలా  వినోదం పండించారని అభిమానులు చెవులు కొరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది.  మరింత అభిమానుల ఆదరణను పొందిన విక్టరీ వెంకటేష్ తన ఎఫ్ 3 సినిమా ఏమాత్రం సక్సెస్ ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: