నాని ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. 'అంటే సుందరానికి' ట్రైలర్ వచ్చేస్తోంది..!

Anilkumar
టాలీవుడ్ లో ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమాతో భారీ సక్సెస్ను అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికి'.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక విడుదల సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సినిమాపై ఆసక్తి పెంచేందుకు మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా నాని తన అభిమానులకు మరో బిగ్ అనౌన్స్మెంట్ అందించాడు.
మే 30 వ తేది ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు 'అంటే సుందరానికి' థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ చాలా డీసెంట్ గా నిర్వహిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాని తాను నటిస్తున్న దసరా సినిమా షూటింగ్ కూడా బ్రేక్ ఇచ్చేసాడు. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో నాని సుందర ప్రసాద్ అనే పాత్రను పోషిస్తుండగా.. హీరోయిన్ నజ్రియా నజీమ్ లీల అనే పాత్రలో కనిపించనుంది. ఇక వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాని జూన్ 10వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వగా.. నాని ఫాన్స్ అయితే ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి నాని సినిమా తో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే జూన్ 10 వరకు వేచి చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: