నందమూరి కళ్యాణ్ రామ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతనొక్కడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయం అందుకొని , ఆ తర్వాత హరే రామ్, పటాస్ , 118 వంటి విజయవంతమైన సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార మూవీ లో హీరోగా నటిస్తున్నాడు .
బింబిసార మూవీ కళ్యాణ్ రామ్ కు కెరియర్ పరంగా 18 వ సినిమా. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్, వారీనా హుసేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కు విశిస్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో విశిస్ట్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ. కె నిర్మిస్తున్నడు. ఈ మూవీ కి 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్ లైన్. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పా న్స్ లభించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా బింబిసార చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజా గా ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో ఈ మూవీ ని ఆగస్టు 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేసింది. అలాగే చిత్రబృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ లుక్ లలో కనబడుతున్నాడు. మరి ఈ మూవీతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.