హాట్ అందాలతో వేడెక్కిస్తున్న సాయి మంజ్రేకర్..!

Pulgam Srinivas
బాలీవుడ్ హాట్ బ్యూటీ సాయి మంజ్రేకర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి మంజ్రేకర్ , సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ 3 సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. దబాంగ్ 3 మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయిన సాయి మంజ్రేకర్ మాత్రం తన నటనతో, అందచందాలతో ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది.

దబాంగ్ 3 మూవీ తో  ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సాయి మంజ్రేకర్ ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా సాయి మంజ్రేకర్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన టాలీవుడ్ సినిమా గని లో హీరోయిన్ గా నటించింది.  గని సినిమాలో సాయి మంజ్రేకర్ , వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన మొదటి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా సాయి మంజ్రేకర్ 'మేజర్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది.

ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సాయి మంజ్రేకర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ , అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సాయి మంజ్రేకర్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో ఈ బ్యూటీ పసుపు రంగులో డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని , తన థాయ్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సాయి మంజ్రేకర్ కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో  తెగ వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: