ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఎక్కడంటే..?

Divya
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఒకవైపు వెండి తెరపై బాగా వెలిగిన ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా బాగా రాణించారు. ఇక ఎన్టీఆర్ చిత్రాలు అంటే ఎక్కువగా రాముడు కృష్ణుడు యముడు గెటప్ లో ప్రేక్షకుల ముందు తారసపడతాయి అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే 28వ తేదీకి ఒక ప్రత్యేకమైన రోజు కూడా ఉంది. ఇక నేటికి 100 వ శత జయంతి దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇక ఈ రోజున రామారావు జయంతి సందర్భంగా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఫిల్మ్ నగర్ సొసైటీ లో ఈయన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిలింనగర్లో విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు సైతం హాజరయ్యారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. జూబ్లీహిల్స్ సభాధ్యక్షులు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ రోజున ఉదయం 10 గంటలకు ఆనంద్ సినీ సర్వీసెస్ దగ్గర తారక రామారావు విగ్రహాన్ని సినీ ప్రముఖులు పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తారకరత్న శతజయంతి సందర్భంగా ఈరోజు అభిమానుల కోలాహలం నెలకొంది. ఇక ఈ రోజున ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ట్విట్టర్లో కూడా #100 th Birth Anniversary OfNTR  అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు అభిమానులు.

ఎన్టీఆర్ కి  తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అభిమానులు సైతం ఇప్పటికే పలు నగరాలలో విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. అభిమానులు సైతం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తూ ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఆయన వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటారు ట్విట్టర్ ద్వారా ఆ విషయాలను తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: