జై బాలయ్య.. జూన్ 10న ఎనౌన్స్ మెంట్..!

shami
నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత తన జోష్ కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో 107వ సినిమా చేస్తున్న బాలయ్య బాబు ఆ సినిమాలో తన ఎనర్జీతో ఫ్యాన్స్ ని ఫిదా చేయడం పక్కా అని చిత్రయూనిట్ చెబుతున్నారు. డైరక్టర్ గా మాస్ పల్స్ బాగా తెలిసిన గోపీచంద్ మలినేని అదిరిపోయే కథతో వస్తుండగా దానికితోడు బాలయ్య యాక్షన్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నారని టాక్. ఇక ఈ సినిమాకు టైటిల్ గా రకరకాల పేర్లు వినబడుతున్నా ఫైనల్ గా అందరు జై బాలయ్య టైటిల్ కే ఓటేసినట్టు తెలుస్తుంది. ఫ్యాన్స్ అందరు బాలయ్యని ముద్దుగా జై బాలయ్య స్లోగన్ తో పిలుస్తారు. అదే టైటిల్ గా పెడితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఈ క్రమంలో బాలకృష్ణ 107వ సినిమాకు జై బాలయ్య టైటిల్ పెడుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. జూన్ 10 బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తారని టాక్.  
దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ చేసినట్టే అని తెలుస్తుంది. ఇక సినిమా నుండి లీక్ అవుతున్న ఫోటోలు ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా గోపీచంద్ జాగ్రత్తపడుతున్నారని తెలుస్తుంది. తప్పకుండా ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మాస్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం ఖాయమని చెప్పొచ్చు. అఖండతో అదరగొట్టిన థమన్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. అఖండ హిట్ మేనియాని గోపీచంద్ సినిమాతో కూడా కొనసాగించాలని చూస్తున్నారు బాలయ్య బాబు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: