అఖండాతో అఖండ విజయం సాధించిన నట సింహం బాలయ్య.. అదే సెంటిమెంట్ ను NBK107కు కూడా అప్లై చేస్తున్నాడా..? అందుకే
సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తి అయిన తరువాత కూడా భారీ మార్పులు చేయిస్తున్నాడా..?
వరుస ఫెయిల్యూర్స్ చూసిన తరువాత బాలయ్య.. అఖండ సినిమాతో భారీ విజయం సాధించాడు. ఇక సినిమాలు స్పీడ్ పెంచిన నటసింహం.. గోపీచంద్ మలినేనితో యాక్షన్
మూవీ చేస్తున్నాడట.. ఈసినిమాలో
శృతిహాసన్ హీరోయన్ గా నటిస్తుండగా..
కన్నడ స్టార్ దునియా
విజయ్ పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సడెన్ గా ఈసినిమాలో భారీగా మార్పులు చేయడానకి శ్రీకారం చుట్టారట మలినేని.
మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న
బాలయ్య సినిమాల కీలక మార్పులు చేస్తున్నారట.
కొత్తగా రెండు సీన్లు స్క్రిప్ట్ లో యాడ్ చేస్తున్నారట గోపీచంద్.దీనికి కారణ
బాలకృష్ణ సెంటిమెంటే అంటున్నారట.. అఖండాలో కూడా అదే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యిందని. అది కంటీన్యూ చేస్తూ.. ఈసినిమాలో కూడా అది ఉండేలా చూడమన్నాడట బాలయ్య.
వాస్తవానికి
బాలయ్య తన ప్రతి సినిమాలోనూ డివోషనల్ టచ్ ఉండేలా చూసుకుంటారట.అది ఆయన సెంటిమెంట్. హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసే విధంగా సన్నివేశాలు ఈసినిమాలో కూడా ఉండాలన్నారట బాలకృష్ణ. అందుకే యాడ్ చేసే ఆ రెండు సీన్లు డెవోషనల్ టచ్ తో ఉంటాయని సమాచారం.
నిజానికి మలినేని గోపీచంద్ చేస్తున్న
సినిమా కంప్లీట్ డిఫరెంట్.. పక్కా
మాస్,కమర్షియల్ యాక్షన్ మూవీ.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో
బాలయ్య అభిమానులకు భారీ ట్రీట్ ప్లాన్ చేశాడట డైరెక్టర్. అయితే ఇందులో సడెన్ గా డెవోషనల్ ను మిక్స్ చేయడం అంటే.. అది పెద్ద పనే అని అయితే ఒరిజినల్ స్టోరీ సోల్ దెబ్బ తినకుండా.. ఈ సీన్లు యాడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడట మలినేని.
అఖండలో డివోషనల్ టచ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్బీకే 107 లోనూ డివోషనల్ టచ్ తో ఒకట్రెండు సన్నివేశాలు చేర్చడానికి ప్రయత్నించమని గోపీచంద్ మలినేనిని
బాలయ్య కోరారని అందుకే ఆయన కొత్తగా రెండు సీన్లను చేర్చారని ప్రచారం అయితే జరుగుతోంది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాకు మ్యూజిక్ సెన్సేషన్
తమన్ సంగీత అందిస్తున్నాడట.. అఖండ సినిమాకు
తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తెగ
రచ్చ రచ్చ చేసింది. ముఖ్యంగా
బాలయ్య ఎలివేషన్ సీన్స్ అయితే ఫ్యాన్స్ కు పూనకం తెప్పించాయి. దాంతో ఈ
మాస్ సినిమాకు కూడా తమనే మ్యూజియ్ చేస్తున్నారట.
ఇక ఈసినిమాకు వేటపాలెం లాంటి కొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఇందులో
బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని సమాచారం.అలాగే శ్రుతీహాసన్ తో పాటు సెకెండ్
హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ని ఫైనల్ చేశారని తెలుస్తుంది.