ఇండస్ట్రీలో వారిద్దరు నాకు రక్షణ కవచం లాంటివారు... టబు..!

Pulgam Srinivas
అలనాటి క్రేజీ హీరోయిన్లలో ఒకరైన టబు గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టబు తెలుగు సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను దక్కించుకుంది. అలా  అలనాటి స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న టబు ప్రస్తుతం కూడా తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం విడుదలైన అలా వైకుంఠపురంలో సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన టబు ఆ సినిమాలోని తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది.  

తెలుగు, తమిళ, హిందీ భాషల సినిమాల్లో నటించిన టబు హీరోయిన్ గా ఈ మూడు ఇండస్ట్రీలోనూ ఫుల్ క్రేజ్ ను సంపాదించింది.  ప్రస్తుతం మాత్రం టబు ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తూ వస్తోంది.  ప్రస్తుతం టబు హిందీ లో అనేక సినిమాల్లో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మీడియాతో ముచ్చటించిన టబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. టబు మీడియాతో మాట్లాడుతూ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో అజయ్ దేవ్ గన్ మరియు దర్శకుడు విశాల్ భరద్వాజ్ నాకు రక్షణ కవచం లాంటివారు అని టబు తెలియజేసింది. 

అజయ్ దేవగన్ మరియు విశాల్ భరద్వాజ్ తో టబు తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. నాకు చాలా సంవత్సరాలుగా అజయ్ దేవ్ గన్,  విశాల్ భరద్వాజ్ తో మంచి స్నేహం ఉంది.  నాలోని మంచి , చెడులు వారిద్దరికీ చాలా బాగా తెలుసు.  విశాల్ భరద్వాజ్ తో చాలా మంచి రిలేషన్ ఉంది.  హీరో అజయ్ దేవగన్ తో కూడా మంచి స్నేహం ఉంది.  13 సంవత్సరాలు ఉన్నప్పటినుండి మా ఇద్దరికీ పరిచయం ఉంది.  ఆ బంధం ఎప్పటికీ ఎంతో బాగా కొనసాగుతుంది అని తాజా ఇంటర్వ్యూలో టబు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: