ఆర్ఆర్ఆర్ vs ఆచార్య..ఓటిటిలో రచ్చ రచ్చే..

Satvika
ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే హంగామా మాములుగా ఉండదు.. ఇటీవల తెలుగులో మంచి టాక్ ను అందుకున్న సినిమా ఆర్ఆర్ఆర్.. ఒకవైపు నెగిటివ్ టాక్ ను అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది.ఈ సినిమాలో హీరోలు చేసిన సాహసం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ ను అందుకుంది.ఇప్పుడు ఓటిటిలో విడుదలకు రెడీ అవుతుంది.అదే విధంగా చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా కూడా అదే విధంగా నెగిటివ్ టాక్ ను అందుకుంది.


కథ పరంగా కూడా పెద్దగా జనాలను మెప్పించ లేకపోయింది. దాంతో సినిమా మొదటి షో కె డిజాస్టర్ గా మారింది. ఒకేహీరో రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే ప్రేక్షకులు ఏ సినిమాని ఎంచుకుంటారు?.. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది మూవీ లవర్స్ మధ్య. ఎందుకంటే బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్.. ప్లాప్ ముద్ర వేసుకున్న మెగా మల్టీస్టారర్ ఆచార్య రెండూ ఒకేరోజు ఓటీటీలో స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలై థియేటర్లలోకొచ్చి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆచార్య సినిమా రెండు వారాల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. అలాంటప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది. కానీ ఊహించని విధంగా పోటీ ఏర్పడింది.

 
ఆర్ఆర్ఆర్ సినిమాను ఈనెల 20న జీ ప్లెక్స్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. అదే టైమ్ లో ఆచార్య సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు పెట్టాలని నిర్ణయించారు..దీంతొ ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది.నిర్ణీత రుసుము చెల్లించి జీ ప్లెక్స్ యాప్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే చాలామంది చూసేశారు. వెయ్యి కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఇలాంటి టైమ్ లో మరోసారి డబ్బులు చెల్లించి ఓటీటీలో చూస్తారా అనే డౌట్ చాలా మందికి రావడం సహజం.ఇక ఆచార్య సినిమాను మళ్ళీ థియెటర్లలో చూడాలంటే జనాలు చూస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: