డాక్టర్
సినిమా సక్సెస్ తో ఫుల్
జోష్ లో ఉన్న
శివ కార్తికేయ తాజాగా డాన్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ
సినిమా తెలుగు తో పాటు తమిళం లో కూడా మే 13 వ తేదిన విడుదల కాబోతుంది. ఇలా ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం లోని సభ్యులు పలు
టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , అలాగే సోషల్
మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా
శివ కార్తికేయన్ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అందులో భాగంగా మల్టీస్టారర్ సినిమాల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
తాజా ఇంటర్వ్యూలో
శివ కార్తికేయన్ మాట్లాడుతూ... తమిళంలో లేదా తెలుగులో నేను మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి రెడీ గానే ఉన్నాను. కాక పోతే పాత్రలలో సమ ప్రాధాన్యత ఉండాలి అని
హీరో శివ కార్తికేయన్ తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మంచి కథ , పాత్రల మధ్య సమాన ప్రాధాన్యత ఉన్నట్లు అయితే మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి రెడీ అని తాజా ఇంటర్వ్యూ
శివ కార్తికేయన్ వెల్లడించాడు.