మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం మే 12 వ తేదీన విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తిని పెంచాయి. చాలా రోజుల తర్వాత మహేష్ అభిమానుల కోసం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మాస్ మసాలా చిత్రం పై సాధారణ ప్రేక్షకులు సైతం భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
ట్రైలర్ ను బట్టి చాలామంది ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. దానికి తగ్గట్లుగానే మహేష్ అభిమానులు ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఏదేమైనా సర్కారు వారి పాట సినిమా విడుదలకు ముందే హిట్ టాక్ ను తెచ్చుకుని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. రికార్డు ల మీద రికార్డులు సాధించడమే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించి రికార్డులను సృష్టిస్తుందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు అందరూ పాజిటివ్ పొగడ్తలనే వినిపిస్తున్నారు గానీ కొంతమంది చేసే నెగిటివ్ విమర్శలను పట్టించుకోవడం లేదు. వాటిని కూడా పట్టించుకుంటే సినిమాకు మంచిదని కొంత మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో కామెడీ పరంగా కమర్షియల్ పరంగా లవ్ స్టోరీ పరంగా మంచి అంశాలే ఉన్నాయి కానీ సెంటిమెంట్ అంశాలు లేవని కొంతమంది చెబుతున్నారు. వాస్తవానికి ఈ తరహా సినిమాల్లోనే సెంటిమెంట్ పాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సినిమాలకు మాత్రమే అలాంటి ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో సెంటిమెంట్ ను జోడిస్తే తప్పకుండా అది సినిమాకు వర్కౌట్ అవదు. అందుకే దర్శకుడు ఈ విధంగా ఆలోచించి ఉండొచ్చు అని మహేష్ అభిమానులు చెబుతున్నారు.