'ఎఫ్3' ట్రైలర్ రెస్పాన్స్ మామూలుగా లేదుగా..!

Pulgam Srinivas
అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ , వరుణ్ తేజ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాణంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే. అలా ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించడంతో ప్రస్తుతం ఎఫ్ 2  సినిమాకు ప్రాంచేజి గా దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమాలో కూడా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా,  తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.  


ఈ సినిమాను దిల్ రాజు నిర్వహిస్తుండగా ఈ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  ఎఫ్ 3 సినిమాను మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.  ఈ సినిమా  విడుదల తేదీ దగ్గర పడటంతో ఎఫ్ 3 చిత్ర బృందం తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది.  తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఎఫ్ 3 మూవీ  ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ  ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది.


తాజాగా విడుదలైన ఎఫ్ 3 మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకొని 24 గంటల సమయంలో 11.73 మిలియన్ ల వ్యూస్ ను మరియు 266.2 కే లైక్ లను సాధించింది. ఇలా ఎఫ్ 3 మూవీ  ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన పాటలలో నుండి కొన్ని పాటలను చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేయగా ఈ పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  మరి ఎఫ్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: