టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన విశ్వక్ సేన్ ఆ తర్వాత ఫలక్నామా దాస్ , హిట్ , పాగల్ వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాలో హీరోగా నటించాడు.
విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఆకాశవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకొని కలెక్షన్లను కూడా బాగానే రాబడుతోంది. ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకొని కలెక్షన్లను కూడా బాగా రాబడుతున్న ఆకాశవనంలో అర్జున కళ్యాణం సినిమా అప్పుడే 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కానుందంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా లో ఈ ప్రచారం పెరిగిపోవడంతో ఈ మూవీ హీరో విష్వక్ సేన్ స్పందిస్తూ... అటువంటి వార్తలను డిలీట్ చేయాలని సూచించారు. ఆకాశవనంలో అర్జున కళ్యాణం సినిమా 'ఓ టి టి' విడుదల పై స్పందిస్తూ... నిజానికి తామే ఇంకా 'ఓ టి టి' విడుదల తేది పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు.
తనకు ఈ మూవీ 'ఓ టి టి' విడుదల తేదీ తెలియదని, తాము ఫిక్స్ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని విశ్వక్ సేన్ చెప్పాడు. తన కొత్త సినిమా ప్రస్తుతానికి థియేటర్ లలో విజయవంతంగా రన్ అవుతోందని , సినిమా 'ఓ టి టి' విడుదల పై వస్తున్న తప్పుడు ప్రచారాలను చూసి కొంత మంది థియేటర్ లకు రాకుండా సినిమా ను 'ఓ టి టి' చూద్దాము అని వాయిదా వేసుకుంటున్నారు అని అందుకోసమని ఈ మూవీ 'ఓ టి టి' విడుదల తేదీ లపై వస్తున్న వార్తలను నమ్మదు అని విశ్వక్ సేన్ పేర్కొన్నాడు.