ఇంద్రజ కష్టాలు తెలిస్తే కన్నీళ్ళాగవు..!!
అదే సమయంలో చేతిలో డబ్బులు లేక ప్రతినెల పని చేస్తే మాత్రమే తాను లోన్ అమౌంట్ పే చేయగలిగే పరిస్థితి కూడా వచ్చింది అని తెలిపింది. అమ్మకు అదే సమయంలో ఆపరేషన్ కూడా చేయాలని వర్క్ చేస్తున్న రెండు కంపెనీలు ఇచ్చిన చెక్కు బౌన్స్ అవడంతో ఎవరిని డబ్బులు అడగాలో తెలియక.. ఏం చేయాలో అర్థం కాక చాలా సతమతమయ్యాము అని తెలిపింది. ఆ సమయంలో నగలు అమ్మి అమ్మ కు ఆపరేషన్ చేయించడం జరిగింది అని ఇంద్రజ చెప్పుకొచ్చింది. ఆరోజు నుంచి డబ్బు అనేది సెకండరీ విషయంగా అయ్యిందని ఎవరికి సహాయం అవసరం వచ్చిన వెంటనే నా చేతిలో ఉంటే డబ్బులు ఇచ్చేస్తాను అని ఆమె తెలిపింది. తన జీవితంలో అత్యంత క్రిటికల్ సమయం కూడా అదే అని తెలిపింది.
ఇక అదే సమయంలో అమ్మను కాపాడుకుంటానో లేదో అని కూడా భయం వేసింది. కానీ ఆపరేషన్ తర్వాత 15 సంవత్సరాల పాటు జీవించారు అని ఇంద్రజ తెలిపింది. మదర్స్ డే సందర్భంగా ఆమె తన అమ్మ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది . అంతే కాదు ఆమె మాటలు విన్న నెటిజన్స్ సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు.