సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉండడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కాక పోతే ఒక స్టార్
హీరో సినిమా తో పాటు ఒక చిన్న
హీరో సినిమా కనుక విడుదల అయినట్లయితే ఆ చిన్న
సినిమా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. అదే ఒకే రేంజ్ వున్న సినిమాలు ఒకే సారి విడుదల కావడం ద్వారా అన్ని
సినిమా కలెక్షన్ లపై దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంటే 12 ఆగస్టు 2022 వ తేదీన దాదాపు ఇలాంటి పరిస్థితే
టాలీవుడ్ ఇండస్ట్రీ
బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే...
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అక్కినేని
అఖిల్ ప్రస్తుతం
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది.
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద
మూవీ ని కూడా ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇప్పటికే ఆగస్టు 12 వ తేదీన రెండు సినిమాలు విడుదల అవుతూ ఉంటే మరో
హీరో కూడా ఇదే తేదీన రాబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న
హీరో నితిన్ తాజాగా
మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మాచర్ల నియోజకవర్గం సినిమాను కూడా ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఇలా జనాల్లో మంచి క్రేజ్ ఉన్న ఈ మూడు సినిమాలు కూడా ఒకే రోజు విడుదల కావడం ద్వారా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 12 వ తేదీన పెద్ద పోరే జరగబోతున్న తెలుస్తోంది.