క్యాబ్ డ్రైవర్ గా మారిన టాలెంటెడ్ హీరోయిన్...!!
ఇటు తెలుగులో కూడా ఐశ్వర్య వరుస సినిమాలు చేస్తూ వుంది.తాజాగా ఆమె కిన్ స్లిన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ పాత్రను చేస్తోందట. కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్‌కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది.
కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఐశ్వర్యా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యక ఇమేజ్ను సంపాదించుకుంది. తాజాగా ఆమె క్యాబ్ డ్రైవర్ అవతారం కూడా ఎత్తింది. రాజేశ్ కిన్ స్లిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'డ్రైవర్ జమున' అనే పేరును కూడా ఖరారు చేశారు. గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్పీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట.. జిబ్రాన్ సంగీతం కూడా అందిస్తున్నారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారని సమాచారం.
అవుట్ అండ్ అవుడ్ రోడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్విస్టులు, కీలక మలుపులతో సాగనుందట . మరోవైపు డ్రైవర్ జమున సినిమా ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని సమాచారం. ఈ సినిమా గురించి దర్శకుడు కిన్ స్లిన్ మాట్లాడుతూ.. ఐశ్వర్యా రాజేశ్ సినిమా అంటేనే సమ్ థింగ్ స్పెషల్ అనే భావన ప్రేక్షకులలో ఉందని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఈ కథను తయారు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
ఐశ్వర్యా రాజేశ్ పేరుకు తమిళ హీరోయిన్ అయినా కూడా ఈమె అచ్చమైన తెలుగమ్మాయి. ఈమె తండ్రి రాజేష్ తెలుగు సినిమాలో ఒకప్పుడు మంచి నటుడు. జంధ్యాల తెరకెక్కించిన సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరిర్ మొదలు పెట్టిందట
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె సువర్ణగా పరిచయం అయింది.