'ఎఫ్ 3' కి సీక్వెల్ కూడా ఉండబోతుందా..?

Pulgam Srinivas
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా దిల్ రాజు నిర్మాణంలో,  దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిందో మన అందరికి తెలిసిందే.  అలా ఎఫ్ 2 సినిమా మంచి విజయం బాక్సాఫీస్ దగ్గర సాధించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు ఫ్రాంచేజి గా ఎఫ్ 3 మూవీ ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.  ఈ మూవీ లో కూడా వెంకటేష్,  వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా,  మెహరీన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.  


దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  ఈ సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో మే 9 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.  ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన సాంగ్స్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్ 3 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్ 4 మూవీ కూడా రాబోతుందట.  


ఈ విషయాన్ని ఎఫ్ 3 సినిమా చివరలో చెబుతారట.  అయితే ఇప్పటి వరకు ఎఫ్ 2 మరియు ఎఫ్ 3 సినిమాలలో రెండు జంటలను మాత్రమే చూపిస్తూ వచ్చారు.  కాకపోతే ఎఫ్ 4  మూవీ లో మూడవ జంట కూడా ఆడ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ 4 మూవీ లో మూడవ జంటగా నాగ చైతన్య తో పాటు మరో అమ్మాయి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: